రోహిత్‌ శర్మ గాయంపై బీసీసీఐ నిర్లక్ష్యం ?

 

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ తొలి రెండు టెస్టులకు దూరమని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ పరిస్టితికి బోర్డు నిర్లక్ష్యమే కారణమనే వాదన వినిపిస్తుంది. తొలి టెస్టు తర్వాత కోహ్లీ సిరీస్‌కు దూరం అవుతున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ కీలకం అవుతారని అంతా ఆశించారు. కానీ, అతను ఆసీస్‌ విమానం ఎక్కడమే ప్రశ్నార్థకంగా మారడం శోచనీయం. రోహిత్‌ గాయం చుట్టూ ఉన్న అంశాలను పరిశీలిస్తే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు, బీసీసీఐ మధ్య ఉన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ స్పష్టమతోంది. ఐపీఎల్‌ 13 లీగ్‌ స్టేజ్‌ సందర్భంగా రోహిత్‌ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ లోపు ఆస్ట్రేలియా టూర్‌కు జట్లను ప్రకటించిన సెలెక్టర్లు రోహిత్‌ను పూర్తిగా పక్కనపెట్టేశారు. దీంతో రోహిత్‌ ఐపీఎల్‌ జర్నీ కూడా ముగిసిందని అంతా భావించారు. కానీ సెలెక్షన్‌ జరిగిన రోజునే ట్రెయినింగ్‌ రీస్టార్ట్‌ చేసిన రోహిత్‌.. చివరి మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో వెంటనే రివైజ్డ్‌ టీమ్‌ ప్రకటించిన సెలెక్టర్లు టెస్ట్‌ సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాలో కోవిడ్‌ కేసులు అలజడి రేపుతున్న దశలో అక్కడి ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్‌ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు. అయితే చివరి రెండు టెస్టుల వరకల్లా అందుబాటులోకి రావాలని జట్టుతో పాటు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆశిస్తోంది. నిజానికి టెస్టు సిరీస్‌కు సమయమున్నప్పటికీ ఆస్ట్రేలియాలో అమలవుతున్న కఠిన కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పటికిప్పుడు బయల్దేరితేనే తొలి టెస్టు ఆడగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *