మహిళలపై 17 మంది అత్యాచారం

 

కట్టుకున్న భర్త కళ్లెదుటే భార్యపై 17 మంది సామూహిక అత్యాచారం చేసిన అత్యంత దారుణ ఘటన జార్కండ్‌లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే దుమ్కా జిల్లాకి చెందిన మహిళ (35) తన భర్తతో కలసి వారాంతపు సంతకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు వారిని అడ్డగించారు. భర్తను నిర్బంధించి అతని ఎదుటే భార్యపై అత్యంత దారుణం గా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అభాగ్యురాలిపై 17 మంది అత్యాచారం చేశారు. ముఫసిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలికి ఐదుగురు పిల్లలున్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని బాధితురాలు గుర్తుపట్టడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు డీఐజీ సుదర్శన్‌ మండల్‌, దుమ్కా ఎస్పీ అంబర్‌ లక్రా తెలిపారు.మహిళల రక్షణకు కఠిన చట్టాలు చేసినా.. న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తున్నా కామకీచకుల్లో కనీస భయం కలగడం లేదు. దేశంలో నిత్యం అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నావ్‌, దిశ, హత్రాస్‌ ఇప్పుడు ఈ ఘటన దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *