అతను తాగే తందానాలాడేందుకే ఐపీఎల్‌కి వస్తాడు

 

ఒత్తిడితో ఆస్ట్రేలియా జట్టుకు బాగా ఆడుతున్న గ్లేన్‌.. ఐపీఎల్‌ను మాత్రం లైట్‌ తీసుకొని విఫలమయ్యాడని టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ దుయ్యబట్టాడు. ఎంజాయ్‌ చేయడానికి, హోటల్‌లో లభించే ఉచిత పానీయాలు తాగి తందాన చేయడానికే మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. ఐపీఎల్‌ అతనికి పారితోషికం తీసుకొనే ఒక విహారయాత్రగా మారిందన్నాడు. ఆడినా ఆడకున్నా డబ్బులు వస్తాయనే ఆలోచన ద క్పథంలో ఉన్నాడు. దాంతో మైదానం, బయటా ఆడుతూ పాడుతూ తందాన చేస్తున్నాడు. ఉచిత సదుపాయాలను ఆస్వాదిస్తున్నాడు. క్యాచ్‌రిచ్‌ లీగ్‌లో అతను ఎప్పుడూ సీరియస్‌గా లేడు. ఆట పట్ల అంకితభావం ప్రదర్శించలేదు. ఐపీఎల్‌కు వచ్చినప్పుడల్లా క్రికెట్‌ కన్నా గోల్‌ాపౖేెనే సీరియస్‌గా దష్టి సారిస్తాడు. అతను సీరియస్‌గా ఉంటే ఎలా ఆడుతాడో మనకు తెలిసిందే’అని వీరూ చెప్పుకొచ్చాడు. విధ్వంసకర ఆటగాడైన ఈ ఆసీస్‌ ప్లేయర్‌ కనీసం ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేకపోయాడు.13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. దాంతో మ్యాక్సీ పనైపోయిందనుకున్నారు అంతా. కానీ ఆస్ట్రేలియా వేదికగా భారత్‌తో వన్డే, టీ20ల్లో మ్యాక్సీ బ్రహ్మాండంగా రాణించాడు. భారత అభిమానులను, ముఖ్యంగా కింగ్స్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీ, ఫ్యాన్స్‌ను వెర్రివాళ్లను చేశాడు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *