రజనీకాంత్‌ పార్టీ గుర్తు అదేనా ?

 

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్టాపించబోయే రాజకీయ పార్టీ పేరు ‘మక్కల్‌ సేవై కర్చీ'(ప్రజాసేవ పార్టీ) అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తుగా ఆటోను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాను డిసెంబర్‌ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు రజినీకాంత్‌ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. ఆ పార్టీకి చీఫ్‌ కో-ఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్‌ వైజర్‌గా తమిళ్రూవి మణియన్‌ను నియమించినట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజినీ పార్టీ 234 నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశముంది. తన పార్టీకి గుర్తుగా ‘బాబా’ లోగోను ఇవ్వాల్సిందిగా రజినీ కాంత్‌ ఎన్నికల సంఘాన్ని కోరగా నిరాకరించింది. చివరికి ఆటో గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబర్‌ 31 రజినీకాంత్‌ తన పార్టీ పేరును అధికారికం గా ప్రకటించనున్నారు. కాగా రజనీ పార్టీకి ఆటో గుర్తు కేటాయించారనే టాక్‌తో ఆయన అభిమానులు మంచి జోష్‌ మీదున్నారు. రజనీ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా చెప్పుకునే బాషా సినిమాలో రజనీ ఆటో డ్రైవర్‌గా నటించి మెప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *