సానియామీర్జా కరోనా

 

భారత టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ సానియా మీర్జా కరోనా బారిన పడ్డారు. ఆ మేరకు ఆమె ట్వీట్టర్లో వెల్లడించారు. దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపారు. తనకి కరోనా పాజిటివ్‌ అని తేలినప్పటికీ.. తనకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని అయినా తాను ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌ లోనే ఉన్నానని అన్నారు. ఈ సమయంలో తన రెండేళ్ల బాబు కుటుంబాన్ని విడిచిపెట్టి ఉండడం చాలా కష్టంగా అనిపించిందని సానియా ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఇదే సమయంలో కరోనా బారినపడి అందరికీ దూరంగా ఆస్పత్రులలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు ఎలాంటి బాధను అనుభవించాయన్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోజుకో కొత్త లక్షణం కనిపించినప్పుడు ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని భౌతికంగా మానసికంగా ఎంతో సంఘర్షణకు గురవుతామని తన అనుభవాల్ని వెల్లడించారు. అయితే కొద్దో గొప్పో తాను అదష్టవంతురాలినని కాకపోతే కుటుంబానికి దూరంగా ఉండటం మాత్రం భయంకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *