కోడికత్తి దాడిలానే మమతాపై కూడా దాడి

 

జగన్‌ కోడికత్తిలానే మమతపై దాడి నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై చోటు చేసుకున్న దాడిని, 2018లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన కోడికత్తి దాడితో పోల్చారు బీజేపీ నాయకుడు లంకా దినకర్‌. ఆమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మమతా బెనర్జీపై దాడిని ఆయన జగన్‌ కోడికత్తి పార్ట్‌-2గా అభివర్ణించారు. ఈ రెండు ఉదంతాలు కూడా ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు, సూచనల మేరకే చోటు చేసుకున్నాయనే అర్థాన్ని వచ్చేలా ట్వీట్‌ చేశారు. ఎన్నికల సమయంలో తమపై దాడులు చేయించుకోవడం వల్ల, ఆ నెపాన్ని ప్రత్యర్థులపై నెట్టొచ్చని, దాని ద్వారా రాజకీయంగా లబ్ది పొందొచ్చని భావిస్తున్నట్లు లంకా దినకర్‌ పేర్కొన్నారు. ఈ రెండు దాడుల వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రమేయం ఉందంటూ పరోక్షంగా ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *