వైసీపీ జెండాలానే షర్మిలమ్మ పార్టీ జెండా !

 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తన అన్న వైఎస్‌ జగన్‌ నెలకొల్పిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరహాలోనే జెండా తయారు చేసే పనిలో వైఎస్‌ షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ జెండాను పోలిన విధంగా మూడు రంగుల్లో తమ పార్టీ పతాకానికి రూపకల్ప చేస్తున్నారామె. పార్టీ జెండాలో ఆకుపచ్చ, నీలం, తెలుపు లేదా పసుపు మిశ్రమం ఉండొచ్చని తెలుస్తోంది. ఆకుపచ్చ, నీలం రంగులు ఖాయం చేశారు. మూడు రంగుగా తెలుపు లేదా పసుపు..ఈ రెండింట్లో ఏదో ఒకటి ఖరారు చేస్తారని అంటున్నారు. తెలుపు కంటే పసుపు వైపే షర్మిల మొగ్గు చూపుతారని తెలుస్తోంది. పార్టీ జెండాలో తెలుపును చేర్చితే.. అచ్చంగా అది వైసీపీని పోలి ఉంటుందని వైఎస్‌ షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల.. తెలంగాణ రాజకీ యాల్లో అరంగేట్రం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఒక్కటొక్కటిగా పూర్తి చేసుకుంటోన్నారు. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి నెల రోజుల కూడా సమయం లేకపోవడంతో.. దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. పార్టీ పేరును ప్రకటించడానికి ముందే.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ వద్ద పేరు రిజిస్టర్‌ చేయించ నున్నారు. మరో వారం రోజుల్లో ఈ పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *