ఆనాడు జగన్‌పై సోనియా, చంద్రబాబు కుట్ర

 

వైఎస్‌ జగన్‌ను సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మకై ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌. విశాఖ నగర కార్యాలయం లో వైఎస్సార్‌ సీపీ ఆవిరాÄ్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ వారి కుట్రలను సీఎం జగన్‌ ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌ పార్టీని స్థాపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీ కష్ణ, పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేకే రాజు, పసుపులేటి బాలరాజు, రెహమాన్‌, తైనాల విజయ కుమార్‌, చొక్కాకుల వెంకటరావు, చింతలపూడి వెంకట రామయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *