మరో వివాదంలో లోకనాయకుడు

 

ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) చీఫ్‌, కమల్‌హాసన్‌ పోలింగ్‌ రోజు (మంగళవారం)  ఒక రిపోర్టర్‌పై దాడి చేశారంటూ ఆరోపణు గుప్పుమన్నాయి. కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గంలోని ఒక పోలింగ్‌ కేంద్రం వద్ద చోటు చేసుకున్నట్టు తొస్తోంది. ఈ ఘటనపై కమల్‌ బహిరంగ క్షమాపణ చెప్పాని ప్రెస్‌ క్లబ్‌ డిమాండ్‌ చేస్తోంది. వీడియోను చిత్రీకరించవద్దని డిమాండ్‌ చేస్తూ కమల్‌ అడ్డుకున్నాడని రిపోర్టర్‌ను తన వాకింగ్‌ స్టిక్‌ తో కొట్టడానికి ప్రయత్నించాడని క్లబ్‌ ఆరోపించింది. అదృష్టవశాత్తూ అతడు గాయపడకపోయినా, కర్ర అంచు అనుకోకుండా జర్నలిస్టు మెడకు తగిలి ఉంటేపరిస్థితి దారుణంగా ఉండేదని ఆరోపించింది. ఈ ఘటన తమను, తమ పాత్రికేయ బృందాన్ని షాక్‌కు గురి చేసిందని తెలిపింది. అంతేకాదు దీనికి చట్టపరమైన పరిణామాను ఎదుర్కోవసి ఉంటుందని కూడా హెచ్చరించడం గమనార్హం. రిపోర్టర్‌ను కొట్టానికి ప్రయత్నించారంటూ కోయంబత్తూర్‌ ప్రెస్‌ క్లబ్‌ ఈ ఘటనను ఖండిరచింది. సోషల్‌ మీడియా వేదిక ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో కమల్‌పై ఆరోపణలు గుప్పించింది. ఈ సందర్భంగా రిపోర్టర్‌ను కొట్టడానికి కమల్‌ తన వాకింగ్‌ స్టిక్‌ పైకి లేపిన చిత్రం వైరల్‌ అవుతోంది. దీంతో వివాదం రగిలింది. అయితే ఈ ఆరోపణపై అటు కమల్‌ గానీ, ఎంఎన్‌ఎం గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *