వైసీపీకి గెలిపిస్తే ఏడు కొండలను అమ్మేస్తారు

వైఎస్సార్‌సీపీకి గెలిపిస్తే ఏడు కొండల ను అమ్మేస్తారన్నారు టీడీపీ ఎంపీ రామ్మోన్‌ నాయుడు.తిరుపతి ఉప ఎన్నికల  ప్రచారంలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు.. జగన్‌ సర్కార్‌ తీరుపై ఫైరయ్యారు. చంద్రబాబు హయాంలోనే తిరుపతిలో అభివృద్ధి జరిగిందని.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని గెలిపించాని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.గత ప్రభుత్వంలో ఏపీ కోసం టీడీపీ ఎంపీలు  ఎనలేని పోరాటం చేశారన్నారు మరో ఎంపీ గల్లా జయదేవ్‌. ఇప్పుడు ముగ్గురు ఎంపీం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతున్నామని.. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ గెలిస్తే కొత్తగా ఏమీ ప్రయోజనం ఉండదన్నారు. రాష్ట్ర సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాట్లాడిన సందర్భాలు లేవని.. పనబాక లక్ష్మి గెలిస్తే పార్లమెంట్‌లో ప్రజా సమస్యు వినిపిస్తారన్నారు. రాష్ట్ర సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఏనాడైన గట్టిగా మాట్లాడారా అని ప్రశ్నించారు టీడీపీ ఎంపీ రామ్మోన్‌ నాయుడు. జగన్‌ను జైలు లో పెడతారనే భయంతోనే.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాట్లాడలేక పోతున్నారన్నారని.. కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే జగన్‌ ఆలోచన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 28మంది ఎంపీలను హోదా కోసం కాకుండా కేసుల కోసం వాడుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదా పేరు ఎత్తాంటే జగన్‌ వణికిపోతున్నారన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో పోరాటం చేస్తామన్నారు ఎంపీ. తిరుపతి ప్రజలు టీడీపీకి గెలిపించాలని సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *