ముందు ఎక్కడైనా గెలిచి అగోరించవయ్యా లోకేష్‌ !

ముందు ఎక్కడైనా గెలిచి అగోరించవయ్యా అని సహా ఇచ్చారు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తన ఉనికికే ప్రమాదం వచ్చిన సందర్భంలో బాబు, ఆయన కుమారుడు వీధి వీధి తిరుగుతున్నారని, అయినా కూడా జనం రావడం లేదు అని తెలిపారు. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేను తరిమి కొడతారట… నిన్నే తరిమికొట్టారు నువ్వు ఎంత చెప్పినా నీ కంఠ శోషే అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. నీకు మిగిలేది ఏమీ లేదు.. చిత్తూరు జిల్లాలోనే నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తున్నారు అని జోస్యం చెప్పారు. వివేకా హత్యపై టీడీపీ, పవన్‌, బీజేపీ మాట్లాడుతున్నారు ఎవరైనా అడగదుచుకుంటే బీజేపీని అడగాలి అని తెలిపారు. కేసు సీబీఐ విచారణ చేస్తోందని గుర్తుచేశారు. లోకేశ్‌ ఏదేదో సవాల్‌ చేస్తున్నాడు.. ఏనుగు వెళ్తుంటే కుక్కు మొరుగుతా ఉంటాయి..నీలాంటి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని కొట్టిపారేశారు. ఎవరి సాయంతోనో స్టాంఫోర్డ్‌లో చదువుకున్న నీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పారు. జగన్మోహన్‌ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత మీకు లేదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఫలితాు ఎలా ఉంటాయనే ఉత్కంఠ ఎవరికీ లేదు.. ఎవరు రెండో స్థానాన్ని అక్రమిస్తారు.? వైఎస్సార్‌సీపీకి ఎంత మెజారిటీ వస్తుంది అనే ఉత్కంఠ ఉంది అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *