జన్మభూమి కమిటీల పేరుతో దోపిడి

 

గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీ పేరుతో ప్రజలను దోపిడి చేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. తమ ప్రభుత్వం నాడు-నేడు పథకంలో భాగంగా కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్ది.. గాంధీజీ కలు కన్న గ్రామస్వరాజ్యం కోసం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటిదాక అర్హులైన సుమారు 63 క్ష మందికి రూ. 2,350 చొప్పున పింఛన్‌ అందిస్తున్నామని అన్నారు. ఏపీలో సుమారు 2,434 రోగాను ఆరోగ్యశ్రీ కింద చేర్చామని పేర్కొన్నారు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతుకు భరోసా కల్పిస్తూ ఏడాదికి రూ. 13,500 అందిస్తుందని స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజకు సంక్షేమ ఫలాల అందజేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. వైఎస్సార్‌ సీపీ 20 నెలల పాలనకాలoలో 90 శాతానికిపైగా హమీలను నెరవెర్చిందని స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *