ముఖ్యమంత్రి కుర్చీ పోతుందనే జగన్ భయం

 

ముఖ్యమంత్రి కుర్చీ పోతుందనే భయంతోనే జగన్మోహన్‌ రెడ్డి తన తిరుపతి ఎన్నికల సభను రద్దు చేసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఆరోపించారు. సీఎం సీటు కోసం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పెద్ద నాయకుడు, వెంకటగరి నుంచి మరో నేత, విజయనగరం నుంచి ఇంకో నాయకుడు ప్రయత్నాు చేస్తున్నారని బాంబు పేల్చారు. సీఎం కుర్చీ కోసం వైసీపీలో ఇప్పటికే రహస్య మంతనాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలిసే జగన్‌ తిరుపతిలో తన సభను రద్దు చేసుకున్నాడని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాజధానిగా ప్రకటించేలా అధిష్టానాన్ని ఒప్పిస్తానని చింతా మోహన్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇప్పుడు దళితులు కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మన్నవరం బెల్‌ పరిశ్రమ, దుగరాజపట్నం ఓడరేవును తీసుకొచ్చి తీరుతానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *