ఏపీలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా

 

రాష్ట్రంలో శనివారం 35వే పరీక్షను నిర్వహించగా 7,224 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదటి దశ కంటే రెండో దశలో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా మొదలైన తర్వాత తొలిసారిగా శనివారం రికార్డుస్థాయిలో 20.11% పాజిటివిటీ నమోదైంది. పరీక్షించిన ప్రతి ఐదుగురిలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్ష వరకు పరీక్షు చేస్తే కేసు సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని నిపుణు అంటున్నారు. వైరస్‌ బారినపడ్డ వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి… చికిత్స చేస్తే మహమ్మారి కట్టడికి అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా బాధితు సంఖ్య పెరిగితే పడకు దొరక్కపోవడంతో పాటు కొత్త సమస్యూ తలెత్తే అవకాశం ఉంది. గతేడాది జులై 29న 70,584 నమూనాను పరీక్షించగా 10,093 (14.30%), 30న 70,068 నమూనాను పరీక్షించగా 10,167 (14.51%) మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ఆగస్టు చివరిలో 60వే వరకు పరీక్షు చేయగా 10 వేకుపైగా కేసు బయటపడ్డాయి. తొలి దశలో అత్యధికంగా అక్టోబరురులో 88,778 నమూనాను పరీక్షించి వైరస్‌ వ్యాప్తిని చాలావరకు కట్టడిచేశారు. ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున తక్కువ పరీక్షకే అధిక సంఖ్యలో కేసు వస్తున్నాయి. కానీ.. వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించే చర్యు నిదానంగా సాగుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *