కుక్కకి రూ. 15 లక్షలు జీతం

 

మనదేశంలో డిగ్రీలు , పీజీలు చదివి పదిమలు , పదిహేను వేల రూపాయిలకు ఉద్యోగాలు చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన దగ్గర లక్ష రూపాయి జీతమంటే ముహారాజు కిందే లెక్క. అలాంటిది నెలకు పదిహేను లక్షల జీతమంటే మాటలా .. కానీ ఈ జీతం తీసుకునేది మనిషీ కాదూ .. మనదేశంలోనూ కాదు. అమెరికాలోని బుష్‌ కంపెనీ కేవం కుక్క కోసం జంతువు ఎముకతో ప్రత్యేకమైన బీరు తయారు చేస్తుంటుంది. ఈ ఆ్కహాల్‌ రహిత బీరును రుచి చూసేందుకు మాంచి ఘ్రాణ శక్తి ఉండి.. రుచి చూడటంలో దిట్ట అయిన కుక్క కావాలి. అందుకే ఎవరైనా తమ పెంపుడు కుక్కను ఈ జాబ్‌లో జాయిన్‌ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కంపెనీ పేపర్‌లో ప్రకటన ఇచ్చింది. బీరు కంపెనీలో చీఫ్‌ టేస్టింగ్‌ ఆఫీసర్‌ జాబును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. నెలకు దాదాపు రూ.15 లక్షల జీతం. రూ.60 వేలు విలువైన హెల్త్‌ ఇన్సూరెన్స్‌. ఇలా చాలా బెనిఫిట్స్‌.  అవి చేయాల్సిందల్లా.. బీరును రుచి చూడటంతోపాటు, సంస్థ అంబాసిడర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. అదీ సంగతి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *