ఇండియాకు వెళ్లొద్దని అమెరికా పౌరులకు వార్నింగ్‌

 

 

ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఇప్పటికే పలు దేశాలు భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధాలు జారీ చేయగా తాజాగా అమెరికా తమ పౌరులకు అక్కడికి వెళ్లద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా నుంచి భారత్‌కు వెళ్లానుకునే ప్రయాణికు వెంటనే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆదేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ భారత్‌కు వెళ్లకపోవడమే ఉత్తమం అని వారు పేర్కొన్నారు. ఇక తప్పని పరిస్థితులో వెళ్లాల్సి వస్తే మాత్రం రెండు డోసు టీకా వేయించుకున్నాకే తగు జాగ్రత్తతో భారత్‌కు వెళ్లాలని అమెరికా ఆరోగ్యశాఖ సూచించింది. ఇక భారత్‌ను 4 కేటగిరీలో చేర్చింది అమెరికా ఆరోగ్యశాఖ. అంటే కోవిడ్‌-19 అత్యంత తీవ్రంగా భారత్‌లో ఉందని చెబుతూ ఈ లెవెల్‌ 4 కేటగిరీ సూచిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోందని ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోందని హెచ్చరికలు జారీ చేసింది అమెరికా ఆరోగ్యశాఖ. పూర్తిగా టీకాలు తీసుకున్న ప్పటికీ కరోనా బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని గైడ్‌లైన్స్‌ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు తమ దేశ పౌరులకు హెచ్చరికలుజారీ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *