మహిళా డైరెక్టర్‌తో మహేష్‌

 

గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలతో స్టార్‌ డైరెక్టర్‌గా సౌత్‌లో పాపులారిటీ తెచ్చుకున్న సుధ కొంగర దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఓ చిత్రం చేయబోతున్నట్లు తొస్తోంది. ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తుండగా..జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కి జంటగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసిన చిత్ర బృందం హైదరాబాద్‌లో ఉగాది రోజున తాజా షెడ్యూల్‌ మొదు పెట్టారు. కొన్ని రోజు షూటింగ్‌ జరిగాక చిత్ర యూనిట్‌ సభ్యులో 5 మందికి కరోనా రావడంతో ప్రస్తుతానికి చిత్రీకరణ నిలిపివేశారు. పరిస్థితు చక్కబడితే త్వరలోనే మళ్ళీ షూటింగ్‌ రీ స్టార్ట్‌ చేయనున్నారు. 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా సర్కారు వారి పాట సినిమాని దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ చేయనున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేష్‌ నటించే సినిమా త్వరలో ప్రారంభం కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *