కొద్ది రోజుల్లోనే ఇండియాకు మరో వ్యాక్సిన్‌

 

త్వరలోనే ఇండియాకు మరో వ్యాక్సిన్‌ రానుంది. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వి’ తొలి బ్యాచ్‌ టీకా డోసు మే 1న భారత్‌కు చేరుకోనున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) హెడ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ తెలిపారు. మే 1వ తేదీన తొలి డోసు భారత్‌కు డెలివరీ అవుతాయి అని ఆయన తెలిపారు. వేసవి చివరినాటికి భారత్‌లో నెకు 50 మిలియన్‌ డోసు చొప్పున టీకాను ఉత్పత్తి చేసే అవకాశాున్నట్లు చెప్పారు. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) కొద్ది రోజు క్రితమే అనుమతించింది. ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు రెడ్డీస్‌ సంస్థతో ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు, మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన రెడ్డీస్‌.. ఇటీవ వినియోగ అనుమతు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ ట్రయల్స్‌ ఫలితాన్ని విశ్లేషించిన నిపుణు కమిటీ.. భారత్‌లో స్పుత్నిక్‌ వి టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *