హత్య కేసులో హీరోయిన్‌ అరెస్ట్‌

 

2018లో ఇదమ్‌ ప్రేమమ్‌ జీవనమ్‌ అనే చిత్రం ద్వారా యువ హీరోయిన్‌ షనయా కత్వే కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఒండు ఘంటేయా కథే లాంటి శృంగార భరిత చిత్రంతో పాపుర్‌ అయ్యారు. కాగా షనయా కత్వే మెడకు మర్డర్‌ కేసు ఉచ్చు బలంగా చుట్టుకొంటుంది. గతంలో తన సొదరుడు రాకేశ్‌ కత్వే హత్య కేసులో షనయా అరెస్టయ్యారు. ప్రస్తుతం ఈ కేసులో షనయాను జుడిషియల్‌ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. షనయా ప్రేమ వ్యవహారం సొదరుడు రాకేశ్‌ కత్వే మరణానికి దారి తీసింది. నియజహెమెద్‌ కటిగర్‌ అనే వ్యక్తితో అఫైర్‌ కొనసాగించడంపై రాకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు వ్యతిరేకించాడు. దాంతో వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాు ఏర్పడ్డాయి. దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో రాకేశ్‌ను తన ప్రియుడితో కలిసి హత్య చేశారు. హుబ్బాలిలోని సొంత ఇంటిలోనే రాకేశ్‌ గొంతు కోసి హత్య చేశారనే విషయం పోలీసు విచారణలో వ్లెడైంది. సోదరుడిని ముక్కుగా నరికి రాకేశ్‌ కత్వే దేహాన్ని ముక్క ముక్కుగా నరికి పు అవయవాను హుబ్బలిలోని పు ప్రాంతాల్లోను, అలాగే గడగ్‌ రోడ్‌ ప్రాంతంలో వేశారు. రాకేశ్‌ హత్య  చూడగానే అనుమానాస్పదంగా మారిన షనయాను విచారించారు. ఆ విచారణలో షనయా ప్రమేయం ఉందని రుజువు కాగానే అరెస్ట్‌ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఆమెను జుడిషియల్‌ కస్టడీకి తరలించారు. షనయాతోపాటు మరో నలుగురు రాకేశ్‌ కత్వే హత్య కేసులో షనయాతోపాటు మరో నలుగురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. షనయా ప్రియుడు నియజహెమెద్‌, తౌసీఫ్‌ చన్నాపూర్‌, అల్తాఫ్‌ ముల్లా, ఆమన్‌ గిరానివాలేను ధర్వాడ్‌ జిల్లా పోలీసు అరెస్ట్‌ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *