రాష్ట్ర పెద్దలకు ఖబడ్డార్‌ చెప్పండి

త్యాగాలతో, పోరాటాలతో ప్రజలు సాధించుకున్న విశాఖ ఉక్కు వంటి పరిశ్రమను కాజేయాలని చూసే రాష్ట్ర పెద్దలకు ఈ మేడే సందర్భంగా ఖబడ్ధార్‌ చెప్పండి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ ట్విట్టర్‌ పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులకు నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నిరంకుశ పెత్తనం, అణచివేత, శ్రమ దోపిడీ ఎక్కువ కాలo సాగవని ప్రపంచానికి తెలియచెప్పిన రోజు మేడే. తమ కష్టంతో సమాజ సంపదను పెంచే కార్మికుల, శ్రామికుల తమ హక్కులను సాధించుకున్న మే డే సందఠరేగా ప్రజందరికీ శుభాకాంక్షలు అంటూ ఓ ఫోటోను లోకేశ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘కరోనా మూంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలి. పరిశ్రమను తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ రోజే శ్రామిక, కార్మిక సోదరులకు. నిజమైన మేడే. ప్రజందరికీ మేడే శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్లు పెట్టారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఉద్యమాన్ని లోకేశ్‌ ప్రస్తావించారు. కరోనా కారణంగా ఆర్ధికంగా ఇబ్బందు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టి, పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగాలు, ఉపాధి కల్పించిన రోజే శ్రామికులకు నిజమైన మే డే అంటూ ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *