ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

 

 

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులుజారీ చేసింది. విశాఖపట్నంలోని ఎల్జీ పాలీమర్స్‌ సంస్థలో ఉత్పత్తులు, ముడిసరకు విక్రయాలకు సంబంధించిన మొత్తాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద జమ చేయాన్న అంశంపై ఈ నోటీసు జారీ అయ్యాయి. గతేడాది మే 7న ఎల్జీ పాలీమర్స్‌లో విష వాయువు విడుదలై దాదాపు 20 మంది మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రజ ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఈ పరిశ్రమను మూసివేయాని ఆదేశించింది. ఈ కేసులో భాగంగా ఎల్జీ పాలీమర్స్‌ సంస్థలో ఉత్పత్తు, యంత్రాలను విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద జమ చేయాని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎల్జీ పాలీమర్స్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ యు.యు.లిత్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ కె.ఎం.జోసఫ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పరిశ్రమ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదను వినిపించారు. మృతులు, బాధితుల కుటుంబాకు ఇప్పటికే రూ. 37.10 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశా ప్రకారం రూ.50 కోట్లు డిపాజిట్‌ చేశామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *