రోడ్డు పక్క ట్రక్కులో 2 లక్షల కరోనా టీకాలు

 

దేశమంతటా వ్యాక్సిన్ల కోసం ఎదురు చూస్తున్న వేళ ఒకటి కాదు రెండు లక్షలు పైబడి ఉన్న వ్యాక్సిన్ల ట్రక్కును రోడ్డు ప్రక్కన పడేసి వెళ్లడం అనుమానాలకు దారి తీస్తుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే .. నర్సింగ్‌పూర్‌ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. కరేలీ ప్రాంతంలో బస్టాండ్‌కు సమీపంలో ఓ ట్రక్కు చాలా సేపు ఆగి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ట్రక్కును తెరిచి చూడగా.. అందులో దాదాపు 2,40,000 డోసుల కొవాగ్జిన్‌ టీకాలు కన్పించాయి. డ్రైవర్‌, క్లీనర్‌ కన్పించలేదు. ట్రక్కు మీదున్న నంబరుతో డ్రైవర్‌ మొబైల్‌ లోకేషన్‌ను ట్రేస్‌ చేయగా.. హైవే సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్నట్లు గుర్తించారు. ట్రక్కులోని ఎయిర్‌ కండిషన్‌ పనిచేస్తుందని, డోసులు సురక్షితంగానే ఉన్నాయని పోలీసు తెలిపారు. వాటి విలువ దాదాపు 8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసు డ్రైవర్‌, క్లీనర్‌ కోసం గాలిస్తున్నారు. ఇంత విలువైన వ్యాక్సిన్లను అలా ఎందుకు రోడ్డు ప్రక్కన పడేసి పోయారని పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *