సబ్బం హరి మృతి

విశాఖ నగర మాజీ మేయర్‌, అనకాపల్లి మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు సబ్బం హరి (69) విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పదిహేను రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. దీంతో గత కొన్ని రోజులగా విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్బం హరికి కొవిడ్‌తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా.. ప్రయోజనం లేకపోయింది. సబ్బం హరి స్వస్థం తగరపువస సమీపంలోని చిట్టివలస. 1952 జూన్‌ 1న జన్మించారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *