కరోనాతో కేంద్ర మంత్రి కూతురు మృతి

ప్రధాని నరేంద్ర మోదీ సహచరుడు, కేంద్ర కేబినెట్‌ మంత్రి కూతురు కొవిడ్‌ కారణంగా కన్నుమూశారు. మోదీ మంత్రివర్గంలో కేబినెట్‌ హోదాతో సామాజిక న్యాయం, సాధికారత శాఖకు మంత్రిగా పనిచేస్తోన్న తవర్‌ చంద్‌ గెహ్లాత్‌ కూతురు యోగితా సోలంకి (44) కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రి గెహ్లాత్‌ కూతురు యోగితా సోలంకి తన కుటుంబంతో కలిసి ఉజ్జయినిలో నివసించేవారు. ఆమె భర్త మధ్యప్రదేశ్‌ వైద్యశాఖలో ఉన్నతోద్యోగి. వారికి 23ఏళ్ల కూతురు, 20ఏళ్ల కొడుకు ఉన్నారు. రెండు వారాలు కిందట కొవిడ్‌ లక్షణాలతో బాధపడిన యోగితాను ఉజ్జయినిలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. కానీ లక్షణాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే ఆమెకు సీటీ స్కాన్‌ నిర్వహించగా షాకింగ్‌ రిపోర్టు బయటపడిరది. అప్పటికే యోగిత ఊపిరితిత్తు 90 శాతం డ్యామేజ్‌ అయినట్లు తేలింది. దీంతో ఆమెను హుటాహుటిన ఇండోర్‌ లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. ఇండోర్‌ మేదాంత ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగానే యోగిత అవయవాలు ఒక్కొక్కటిగా దెబ్బతింటూ వచ్చాయి. ఊపిరితిత్తులు డ్యామేజీకి తోడు బ్లడ్‌ క్లాట్స్‌ కారణంగా గుండెపోటు రావడంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కన్నుమూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *