ఆంధ్రాలో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్‌

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్‌ ఎన్‌ 440కె ఏపీలో వ్యాపించిందన్నారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు. తొలిసారిగా దీనిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారన్నారు. ఇతర వైరస్‌ కన్నా 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాన్నారు. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాలు చేపట్టాన్నారు. బెడ్లు-ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రంగుల కోసం రూ.3000 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిందన్నారు. గోరంతల్ని కొండంతలుగా చేసి ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఇప్పటికే 14 రోజు లు పాటు ఒరిస్సా లాక్‌డౌన్‌ను ప్రకటించిందని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *