దొంగ ఓట్లతోనే తిరుపతి విజయం

 

తిరుపతి ఉప ఎన్నిక ల్లో వైసీపీ సాధిం చింది దొంగ ఓట్లు, దొంగ నోట్ల విజయ మని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె న్నాయుడు ఆరోపించారు.అంతేకాదు దొంగ ఓట్లు వేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మండిపడిన అచ్చెన్నాయుడు, దొంగ ఓట్లకు పాల్పడలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా వైసీపీ నేతలు ప్రమాణం చేస్తారా అని సవాల్‌ విసిరారు.  తిరుపతి ఉప ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలుపు జగన్‌ రెడ్డి సంక్షేమ పథకాల విజయం కాదని, ప్రైవేటు బస్సు విజయమని ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. దొంగ కంపెనీలు పెట్టి వేల కోట్లు దోచినట్లు, దొంగ ఓట్లు వేసి తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని  అచ్చెన్న ఫైర్‌ అయ్యారు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిచినా నైతికంగా తొగుదేశం పార్టీనే గెలిచిందని ప్రజలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *