ఏపీలో సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌

ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌లకు జగన్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో కొత్తగా సర్పంచ్‌లుగా గెలిచిన వారందరికీ చెక్‌ పవర్‌ను బదలాయిం చేందుకు పంచాయతీరాజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిర్వహించలేదు.. 2018 నుంచి మొన్న పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారు పాలన కొనసాగింది. వారికే చెక్‌ పవర్‌ అధికారం ఉంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచ్‌లు ఏప్రిల్‌ 3న పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారికి చెక్‌ పవర్‌ను బదలాయించే ప్రక్రియను మొదలు పెట్టారు.వారంలోగా సర్పంచ్‌ందరికీ చెక్‌ పవర్‌ కల్పిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ చెప్పారు.సర్పంచ్‌ల  వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)లో నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాయం ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఆన్‌లైన్‌లో వివరా నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.సీఎఫ్‌ఎంఎస్‌లో వివరాలు నమోదుకు ఆర్థిక శాఖ అవకాశం కల్పించిన వెంటనే సర్పంచ్‌ గొపు ధ్రువీకరణ పత్రాలు, వారి ఇతర వివరాలు, డిజిటల్‌ సిగ్నేచర్‌ను అన్ని సబ్‌ ట్రెజరీ ఆఫీసుల్లో అందజేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ వివరాలు నమోదు పూర్తయ్యాక జిల్లా ట్రెజరీ అధికారంలు ఆమోదముద్ర వేయాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *