పేదలకు రెండు నెలల రేషన్‌ ఫ్రీ .. రూ.5,000 ఆర్ధిక సాయం

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు, పేదలను ఆదుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇచ్చిన మాటను ప్రకారం పేదలకు రెండు నెలలు పాటు ఉచితంగా రేషన్‌ అందజేయనున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ లోని 72 లక్షల కార్డుదారులకు రాబోయే రెండు నెలలు ఉచితంగా రేషన్‌ అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా రేషన్‌ ఉచితంగా అందజేస్తామని, ఆర్ధికంగా ఇబ్బందు పడుతున్న పేదకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీ స్పష్టం చేశారు. అలాగే, ఢల్లీిలోని ఆటోరిక్షాలు, ట్యాక్సీ డ్రైవర్లకు కూడా రూ.5,000 ఆర్ధిక సాయం ప్రకటించారు. కరోనా కాలoలో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్న డ్రైవర్లు ప్రతి ఒక్కరికీ చిరు సాయంగా రూ.5,000 చొప్పున అందజేస్తామని తెలిపారు. రేషన్‌ ఉచితంగా ఇస్తామంటే లాక్‌డౌన్‌ రెండు నెలలు కొనసాగుతుందని అనుకోవద్దని కేజ్రీవాల్‌ స్పష్టతనిచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *