చిరు – నాగ్‌ మల్టీస్టారర్‌

 

 

టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌ రాబోతుంది. ఎన్నాళ్లగానో అభిమాను ఎదురు చూస్తున్న ఈ మల్టీస్టారర్‌లో మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున నటించబోతున్నట్లు సమాచారం. కోలీవుడ్‌లో మాధవన్‌, విజయ్‌ సేతుపతి నటించిన ‘విక్రమ్‌ వేద’ సినిమాను తెలుగులో నాగార్జునతో కలిసి రీమేక్‌ చేయడానికి చిరు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. విజయ్‌ సేతుపతి క్యారెక్టర్‌లో చిరంజీవి, మాధవన్‌ పాత్రలో నాగార్జున నటించబోతున్నారట. ఇప్పటికే టాలీవుడ్‌లో మల్టీస్టారర్ల జోరు కొనసాగుతుంది. చిరంజీవి, రామ్‌చరణ్‌ ఆచార్య సినిమాలో నటిస్తుండగా, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి మరో సినిమా చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *