వ్యాక్సిన్‌ తీసుకున్నా డాక్టర్‌ మృతి

వైద్య నిపుణులు ఎంతగా చెబుతున్నా చాలామంది నిర్లక్ష్యం కారణంగానే కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీని బారిన పడి ప్రజలు వివిలాడిపోతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుందగా మరికొందరు చావు అంచులు వరకూ వెళ్లి వస్తున్నారు. కాగా కరోనా నివారణకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని వైద్యలు చెబుతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్‌ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యం చేయకూడదని అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. అలా జాగ్రత్తలు చెప్పే డాక్టరే తన నిర్లక్ష్యం మూంగా ప్రాణాలు కోల్ప్ణోయాడు. వివారాల్లోకి వెళితే ఢల్లీిలోని సరోజ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ ఎకె రావత్‌(58) కోవిడ్‌ వ్యాక్పిన్‌ తీసుకున్నప్పటికీ కరోనా సోకడంతో శనివారం మరణించారు. ‘ఏప్రిల్‌,మే ఈ రెండు నెల వ్యవధిలోనే సరోజ్‌ ఆస్పత్రిలోని సుమారు 80 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని, రావత్‌ తన జూనియర్‌ డాక్టర్‌ అని, చాలా ధైర్యవంతుడు’ అని డాక్టర్‌ భరద్వాజ్‌ అన్నారు. ‘నేను వ్యాక్పిన్‌ తీసుకున్నాను. నాకేం కాదు’ అని రావత్‌ తనతో అన్న చివరి మాటను డాక్టర్‌ భరద్వాజ్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *