పెళ్లి చేసుకోను అంటున్న హీరోయిన్‌

 

 

ఒకప్పుడు దాదాపు టాలీవుడ్‌ హీరోందరితోనూ నటించింది ఛార్మి. గత కొంతకాలoగా నిర్మాతగా మారి పూరీ జగన్నాధ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో లైగర్‌ అనే సినిమా నిర్మిస్తోంది ఛార్మి. కాగా ఛార్మి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా వార్త ఒకటి ప్రసారం జరుగుతోంది. దీనిపై స్పందించింది ఛార్మి. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, పెళ్లంటే తనకు ఇష్టం లేదంది. ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉన్నానని, పెళ్లి మాటే తన జీవితంలో లేదని స్పష్టం చేసింది ఛార్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *