కుప్పంలో ఒక్క రోగి లేకుండా చేయొచ్చుగా’

టీడీపీ అధినేత చంద్రబాబు … సముద్రాన్ని కంట్రోల్‌ చేశా, తుపానును దారి మళ్లించా అని కాకమ్మ కబుర్లు చెబితే నమ్మే రోజు కాదు బాబూ. మంత్ర దండం ఏదైనా ఉంటే కుప్పంలో ఒక్క రోగి లేకుండా చేయొచ్చుగా’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఈ ‘వారం రోజు సీఎం కుర్చీ’ పగటి క ఏంటి చంద్రబాబు? జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి పొడిచింది ఏముంది? ఏ స్కీమ్‌ వల్లనైనా ప్రజలు జీవన ప్రమాణాలు పెరిగాయని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా ? ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం బొట్లు పెట్టి ఇంటికి పంపించింది’ అని విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. తుపాన్లు వచ్చి ప్రజలు నిరాశ్రయులై, సర్వం కోల్పోతే మంచి నీళ్లు సహా హెరిటేజ్‌ సరుకును అమ్ముకున్న నీచ చరిత్ర బాబుదని మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *