లాక్‌డౌన్‌ తగ్గిన కరోనా కేసులు

 

ఢిల్లీలో లాక్‌డౌన్‌ కారణంగా పాజిటివిటీ రేటు 35 నుంచి 23 శాతానికి తగ్గిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. శనివారం17, 364 కేసు నమోదయ్యాయని చెప్పారు. ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 17 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని చెప్పారు. అలాగే, ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్ల సంఖ్యను పెంచుకునేందుకు వినియోగించామని అన్నారు. ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజన్‌ కొరత తగ్గిందని చెప్పారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. యువకు చాలా మంది వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారని వివరించారు. ఢిల్లీలో వ్యాక్సిన్‌ డోసులు తక్కువగా అందుబాటులో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని మేము ఆశిస్తున్నామని చెప్పారు. లాక్‌డౌన్‌ కాలాన్ని తాము వైద్య మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు వాడామని తెలిపారు.లాక్‌డౌన్‌ మంచి ఫలితాలను ఇస్తోందని అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *