మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీజీపీగా పదవీ బాధ్యతు నిర్వర్తించిన ప్రసాద్‌రావు గుండెపోటుతో అమెరికాలో కన్నుమూశారు. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్న ప్రసాద్‌రావును కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఆయన మరణించినట్లు వైద్యు తెలిపారు. ప్రసాద్‌రావు గతంలో ఏసీబీ డీజీ, ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా, హైదరాబాద్‌ సీపీ, విశాఖ ఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ప్రసాద్‌రావు స్వస్థం గుంటూరు జిల్లా. ప్రసాద్‌రావు మృతికి ఆంధ్రా, తెంగాణ ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *