అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌

 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో తెలంగాణ పోలీసు అంబులెన్స్‌లను అడ్డుకోవటంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. దేశంలో ఇలాంటి సర్క్యులర్‌ ఎక్కడా ఇవ్వలేదని, ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చలేదని పేర్కొంది. ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు.. హైదరాబాద్‌ వాసులకు కూడా బెడ్‌ కన్ఫర్మ్‌ అవ్వట్లేదని, నేషనల్‌ హైవే యాక్ట్‌ను ఉల్లంఘిచ0డానికి ప్రభుత్వానికి అనుమతి లేదని తెలిపింది. అంబులెన్స్‌లను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. అంబులెన్స్‌లను ఆపే అధికారం తెలంగాణ  ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *