అన్నా క్యాంటిన్లను మూసివేసి పేదలకు అన్నం లేకుండా చేశారు

 

ఏపీ రాష్ట్రంలో కనీసం పేదలకు భోజనం పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్నా క్యాంటిన్లు పెట్టామని, రూ. 5 కే పేదలకు భోజనం అందించామన్నారు. ఈ ప్రభుత్వం అన్నా క్యాంటిన్లు అలాగే కొనసాగించితే పేదలు భోజనం చేసేవారన్నారు. సీఎం జగన్‌ అన్నా క్యాంటిన్లను మూసివేసి పేదలకు అన్నం లేకుండా చేశారని మండిపడ్డారు. అన్నా క్యాంటిన్‌ పేరు ఇష్టం లేకపోతే కనీసం వైఎస్‌ పేరుమీద అయినా ఆ క్యాంటిన్లు కొనసాగిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై తొగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *