దద్దమ్మ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికీ ఉండకూడదు

ఇంత చేతగాని, దద్దమ్మ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికీ ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్లో ధ్వజమెత్తారు. ఏపీ అంబులెన్స్‌లను తెలoగాణలోకి వెళ్లేందుకు అనుమతి వచ్చేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రజలు ప్రాణాలు  కాపాడాలని డిమాండ్‌ చేశారు. తాడేపల్లి కొంపలో ఎన్ని గంటలు నిద్రపోతారు గానీ, లేచి కేసీఆర్‌ గారికి ఫోన్‌చేసి అనుమతు తెప్పించండి. తెంగాణ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో అత్యవసరంగా పరిగణించి కోవిడ్‌ పేషెంట్ల అంబులెన్సును అనుమతించాలి. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారికి మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్‌ తరలిస్తారు. తెంగాణ ప్రభుత్వం దీనిని దృష్టిలో వుంచుకుని కోవిడ్‌ పేషెంట్ల అంబులెన్సును ఆపకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. గోల్డెన్‌ అవర్స్‌లోగా వారు ఆస్పత్రికి చేరగలిగితే కొన ఊపిరితో ఉన్న ప్రాణాలు నిలబడతాయి’’ అని లోకేష్‌ పేర్కొన్నారు.

 

 

 

ంంజూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *