భారత్‌కు 5 కోట్ల ఫైజర్‌ వ్యాక్సిన్లు ?

 

భారత్‌కు 5 కోట్ల ఫైజర్‌ వ్యాక్సిన్లు సరఫరా చేసిందుకు..ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఫైజర్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌లో కరోనా టీకా కొరత కొనసాగుతున్న తరుణంలో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి తాము తయారు చేసిన 50 మిలియన్ల కరోనా టీకా డోసుల్ని భారత్‌కు అందించేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ఆధారంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్లు భారత్‌లో గుర్తించిన వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నాయని ‘యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ’(ఈఎంఏ) తెలిపింది. దీనిపై మరింత లోతైన అధ్యయనం జరుపుతున్నట్లు తెలిపింది. ఈఎంఏ ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా, అస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్ల విని యోగానికి అనుమతి ఇచ్చింది. అయితే, అమెరికాలో ఉత్పత్తి అవుతున్న ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్లను ఎగుమతి చేయ డానికి ఇప్పటి వరకు అమెరికా అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాల్లో ఫైజర్‌ టీకాను ఉత్పత్తి చేస్తున్న కేంద్రా నుంచే భారత్‌కు సరఫరా చేయాల్సి ఉంటుంది. మరోవైపు అనేక రాష్ట్రాు నేరుగా టీకాను కొనుగోలు చేసేందుకు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *