మోడీకి .. భారతీయులు ఎలా పోతేనేం ?

మోదీ ఇప్పుడు నిజంగానే ప్రపంచ నేత. భారతీయులు ఎలా పోతేనేం’’ అని తీవ్రస్థాయిలో ప్రధానిపై మాజీ బీజేపీ, ప్రస్తుత తృణమూల్‌ నేత యశ్వంత్‌ సిన్హా విమర్శలు గుప్పించారు. ఆయన తన ట్విటర్‌లో.. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి టీకాలకు సంబంధించి తెలుపుతున్న 10 సెకండ్ల వీడియోను ట్వీట్‌ చేశారు. ‘‘ఈ పది సెకన్ల వీడియో మోదీ భండారాన్ని బయటపెట్టింది. భారత్‌ తన ప్రజలకు ఇచ్చిన దానికన్నా అధిక వ్యాక్సిన్‌ను విదేశాలకు పంపిందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి చెప్పారు. ఈ కామెంట్‌తో పాటుగా ఆయన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత రాయబారి ప్రసంగించిన వీడియో క్లిపింగ్‌ను జతచేశారు. ఆ వీడియోలో.. భారత్‌లో సరఫరా చేసిన టీకా కన్నా అధికంగా 70 దేశాలకు భారత్‌ టీకాను సరఫరా చేసినట్లు రాయబారి తెలిపారు. దేశంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం ద్చాుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరిపడా సరఫరా చేయడంలో కేంద్రం విఫమయ్యింది. ఇందుకు మోదీ సర్కార్‌ అనుసరించిన వ్యాక్సిన్‌ విధానం కారణంగానే ప్రస్తుతం దేశంలో టీకా కొరత ఏర్పడిరదని జాతీయ స్థాయిలో పలు వురు నేతలు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *