ఫైజర్‌ వ్యాక్సిన్‌తో గుండెమంట ?

 

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో గుండె మండటాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం, 2020 డిసెంబరు నుంచి 20 21 మే వరకు సుమారు 5 మిలియన్ల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వీరిలో 275 మందికి మయొకార్డిటిస్‌ (గుండె మంట) వచ్చినట్లు వెల్ల డైంది. ఈ లక్షణాలుగలవారిలో ఎక్కువ మంది దాదాపు నాలుగు రోజులపాటు ఆసుపత్రులలో చికిత్స పొందినట్లు తెలిపింది. ఇటువంటి కేసుల్లో 95 శాతం వరకు స్వల్ప స్థాయికి చెందినవిగా గుర్తించారు. నిపుణులతో కూడిన మూడు బృందాలు ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న యువతలో ఈ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన్‌కు, ఈ లక్షణాలకు సంబంధం ఉండ వచ్చునని పేర్కొంది. ఈ అంశంపై నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపింది. ఈ లక్షణాలు 16 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కుల్లో కనిపించినట్లు వివరించింది. మరీ ముఖ్యంగా 16 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఇది ఎక్కువగా కనిపించినట్లు తెలిపింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *