అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు

అవినీతికి ఆస్కారం లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోతుందని అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోగా.. తిరిగి ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలు గుండెల్లో నిలిచిపోయే విధంగా నిర్మాణాలు చేస్తున్నారని కొనియాడారు. కాలనీలే కాకుండా ఊర్ల నిర్మాణం చేస్తున్నారని.. రోడ్లు, డ్రైనేజీలు, ఇంటర్నెట్‌ సౌకర్యాలు చేస్తున్నారని తెలిపారు. పేదలు జీవితంలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయని, పాదయాత్రలో ఇచ్చిన హామీ లను సీఎం ఈరోజు నెరవేరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *