ప్రధాని, గవర్నర్లకు రఘురామకృష్ణరాజు లేఖలు

జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించాలని. రాజద్రోహం కేసు కారణంగా రామకృష్ణ రిమాండ్‌లో ఉన్నారని, మధుమేహం, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. రామకృష్ణకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. జడ్జి రామకృష్ణ కుటుంబసభ్యుల ఆవేదనను అర్థం చేసుకుని, జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు. ప్రధానికి కూడా ఆయన లేఖ రాశారు. నర్సాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ ఇంటర్నేషనల్‌ ఫిషరీష్‌ వర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖ కోరారు. భీమవరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని రఘురామ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *