జూలై 8న వైఎస్‌ షర్మిల పార్టీ ప్రారంభం

రాజశేఖర్‌ రెడ్డి గారి పుట్టినరోజు జులై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని వైఎస్‌ షర్మిల ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్‌ తెలిపారు. షర్మిల తన కొత్త పార్టీని ‘వైఎస్సార్‌ టీపీ’గా రిజిస్ట్రేషన్‌ చేయించారు. ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్ళీ తీసుకురావడం కోసం, ఆయన ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా, వైఎస్సార్‌ గారు అందించిన సంక్షేమం.. ప్రతి ఇంటికి మళ్ళీ చేరేలా ‘వైఎస్సార్‌ తెలంగాణ’ పార్టీ పెట్టాలనుకుందని మీ అందరికి తెలిసిందేనని వాడుక రాజగోపాల్‌ వెల్లడిరచారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పేరు వైఎస్‌ విజయమ్మ గారి సమ్మతితోటి .. వారి ఆశీస్సుల తోటే జరిగింది కాబట్టి ఇతరులకు అభ్యంతరం ఉంటుంది అని మేము అనుకోవడం లేదు. రాజశేఖర్‌ రెడ్డి గారి పుట్టినరోజు జులై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను.. కార్యక్రమాలను మేము ఇప్పటికే ప్రారంభించాం’’ అని రాజగోపాల్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *