మహాత్మాగాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ ఎంతో మంది పేదలకు న్యాయ సహాయం చేశారు. అయితే ఇప్పుడు గాంధీ పేరును మునిమనవరాలు ఆశిష్‌ లతా రామ్‌గోబిన్‌(56) దిగజార్చేలా ప్రవర్తించడం చర్చనీ యాంశంగా మారింది. ఓ ఫోర్జరీ కేసులో దోషిగా తేలిన మహాత్మాగాంధీ మునిమనవరాలు ఆశిష్‌ లతా రామ్‌గోబిన్‌ (56)కు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆశిష్‌ లతా రామ్‌గోబిన్‌… వ్యాపారవేత్త ఎస్‌ఆర్‌ మహరాజ్‌ను మోసం చేసినట్లు తేలింది. భారత్‌ నుంచి ఆమెకు వచ్చే ఒక కన్‌సైన్‌మెంట్‌కు కస్టమ్స్‌ డ్యూటీస్‌ చెల్లించేందుకు మహరాజ్‌ ఆమెకు అడ్వాన్స్‌ రూపంలో రూ.3.23 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) ఇచ్చారు. అయితే ఆ కన్‌సైన్‌మెంట్‌ నుంచి వచ్చే లాభాల్లో కొంత మొత్తం ఆయనకు లభిస్తుంది. అయితే అటువంటి కన్‌సైన్‌మెంట్‌ ఏదీ లేదంటూ కొన్ని నకిలీ బిల్లులు సృష్టించి, మహరాజ్‌ను ఆమె మోసం చేశారని విచారణలో తేలింది. దాంతో కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *