హామీలను నెరవేర్చడంలో జగన్‌ విఫలం

 

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో జగన్‌ రెడ్డి విఫల మయ్యారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకు వస్తాన న్నారని ఎంపీ గుర్తుచేశారు. హోదా వస్తేనే పెట్టుబడులు, ఉద్యోగాలు, నిధులు వస్తాయని యువతకు చెప్పి నమ్మకద్రోహం చేశారని మండి పడ్డారు. 22 మంది ఎంపీలున్నా కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. ఓట్లు దండుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికే జగన్‌ రెడ్డి హోదాను వినియోగించుకున్నారని విమర్శిం చారు. అవినీతి కేసుల్లో జైలుకు పంపిస్తారనే భయంతో కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నా రని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందని… అందుకు జగన్‌ రెడ్డి ఏం చేస్తారో సమాధానం చెప్పాలని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. హోదాపై మోసగించిన జగన్‌ రెడ్డిని యువత నిలదీయాలని కోరారు. కేసుల కోసం లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *