జగన్‌ సర్కార్‌పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు

 

పోలవరం అంశంతో పాటు తనపై దాడి వివరాలను పేర్కొంటూ రెండు వేర్వేరు లేఖలు కేంద్రమంత్రి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కి నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు అందజేసినట్లు తెలిసింది. బుధవారం కేంద్రమంత్రితో భేటీ అయిన ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఫిర్యాదు చేశారు. గతనెల 14న ఏపీ సీఐడీ పోలీసుల దాడి వివరాలు కూడా గజేంద్రసింగ్‌ షెకావత్‌కు రఘురామ తెలిపినట్లు సమాచారం. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నట్లు కేంద్రమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని.. లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులో రఘు రామ పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అదనపు నిధులు కేటాయిస్తున్నారని.. కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుం టున్నా రని ఆయన ఆరోపించారు. దీనిపై వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *