అధినేతపై తిరుగుబాటు చేస్తే అచ్చెన్నే నాయకత్వం వహిస్తారా

టీడీపీ అధినేత చంద్రబాబుపై తిరుగుబాటు చేస్తే అచ్చెన్నే నాయకత్వం వహిస్తారా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోందని.. టీడీపీ తెలంగాణా అధ్యక్షుడు తెరాసలోకి జంప్‌ అట. ఇక్కడ కూడా అలాంటి గందరగోళమే ఉంది. జూమ్‌ మీటింగులతో పిచ్చెక్కి పోయిన నేతలు కఠిన నిర్ణయం తీసుకోకపోతే తమ ఫ్యూచర్‌ నాశనం అవుతుందని టెన్షన్‌ పడుతున్నారంట. అచ్చెన్నే నాయకత్వం వహిస్తాడా తిరుగుబాటుకు?’’ అని ట్వీట్‌ చేశారు. టీడీపీ అధ్యక్షుడు రమణ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధినేత చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఏపీలోనూ నేతలు తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. జూమ్‌ మీటింగులతో పిచ్చెక్కిపోయిన తెలుగు తమ్ముళ్లు కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని.. లేకుంటే తమ భవిష్యత్తు నాశనం అయిపోతుందనే టెన్షన్‌లో ఉన్నారని విజయసాయి అన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *