మాట మార్చిన రాందేవ్‌ బాబా

శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని చెప్పారు యోగా గురు రాందేవ్‌. ఈమధ్యే అల్లోపతి వైద్యంపై తీవ్ర విమర్శలు చేసిన రాందేవ్‌పై వెయ్యికోట్ల రూపాయిలకు దావా వేశారు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ బృందం. మరి ఆ దెబ్బకు భయపడ్డారో లేక మనసు మార్చుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు అల్లోపతి వైద్యం గురించి గొప్పగా మాట్లాడారు. వైద్యులు దేవుని దూతల్లాంటి వారంటూ తాజాగా పేర్కొన్నారు. తన పోరాటం వైద్యులపై కాదు, మాదకద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగా అంటూ ప్రకటించారు. అంతేకాదు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ దుమారాన్ని రాజేసిన ఆయన త్వరలోనే తాను కూడా కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటానని ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్‌ 21 నుంచి అందరికీ ఉచిత టీకా అందుబాటులో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *