వైకాపా ప్రభుత్వానికి కాదేది అవినీతికి అనర్హం

మద్యం, ఇసుక, గ్రూప్‌-1 ఇలా వైకాపా ప్రభుత్వానికి కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనం సక్రమంగా జరగలేదని ఫిర్యాదులు వచ్చాయని లోకేశ్‌ అన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి అధ్యయనం లేకుండా డిజిటల్‌ మూల్యాంకనం ఎంచుకున్నారని మండిపడ్డారు. ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, మార్కులు, జవాబు పత్రాలు వెల్లడిరచాలని డిమాండ్‌ చేశారు. డిజిటల్‌ మూల్యాంకనం సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆన్‌లైన్‌ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)ను వైకాపా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌గా మార్చేశారని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఏపీపీఎస్సీలో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రాసిన అభ్యర్థులతో లోకేశ్‌ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 2018 నోటిఫికేషన్‌కు 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలు జరిగాయని.. 9,678 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల్లో 340 మందినే ఇంటర్వ్యూకు పిలిచారన్నారు. కనీస విద్యార్హత లేని వారిని ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించారని లోకేశ్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *