వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణికి సిజేరియన్‌

విశాఖపట్నం కింగ్‌జార్జ్‌ ఆస్పత్రి (కేజీహెచ్‌ ) సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో ఉన్న 30 ఏళ్ల గర్భిణికి గైనకాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.కవిత ఆధ్వర్యంలోని బృందం గురువారం ఉదయం శస్త్రచికిత్స చేసింది. అయితే ఆమె కరోనా బాధపడడం ఇక్కడ చెప్పుకోవాలి. కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణికి వైద్యులు విజయవంతంగా సిజేరియన్‌ పూర్తిచేశారు. ిజేరియన్‌ చేసి మగబిడ్డను బయటకు తీశారు. వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి శస్త్రచికిత్స చేయడం కేజీహెచ్‌ చరిత్రలో తొలిసారి అని డాక్టర్‌ కవిత తెలిపారు. అనంతరం శిశువుకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్‌ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్యం కూడా మెరుగు పడిరదని.. ఆమె ఆక్సిజన్‌ స్థాయులు పెరిగాయని వైద్యులు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *